AP CM YS Jagan Mohan Reddy : జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల.. అకౌంట్లలో పడిన డబ్బుల వివరాలు ఇలా..
ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది,
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని సీఎం జగన్ అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8,44,336 తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు.
అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు.
‘నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మూడో తరగతి నుంచే సబ్జెట్ టీచర్‌తో పాఠాలు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. రోజుకో మెనూతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్ రూమ్‌లను డిజిటలైజేషన్ చేశాం. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్. డిసెంబర్ నాటికి మరో 33 వేల క్లాస్‌రూమ్‌లు డిజిటలైజేషన్ చేయిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.