Videshi Vidya Deevena: కాపులకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’లు
ప్రపంచంలో 200లోపు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన 81 మంది కాపు విద్యార్థులు విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియను కాపు కార్పొరేషన్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వందలోపు ర్యాంకింగ్ కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి వంద శాతం, 100 నుంచి 200 మధ్య ర్యాంకింగ్ కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి ప్రభుత్వం 50 శాతం సాయం అందిస్తున్నట్టు చెప్పారు.
చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..
చరిత్రలో ఎవరూ ఇవ్వనంతగా రూ.50 లక్షల వరకూ సాయం చేయనున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కాపు వర్గాలు రుణపడి ఉంటాయన్నారు. ఇలాంటి పథకాలు కాపులతో పాటు రాష్ట్రంలోని ప్రతిభ కలిగిన విద్యార్థుల వికాసానికి అండగా నిలుస్తాయని శ్రీహరి ప్రశంసించారు.
చదవండి: Student Loans: 10 వేల డాలర్ల దాకా విద్యార్థి రుణాల మాఫీ