Skip to main content

PHD Admissions: పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు!

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల రెండో కేటగిరీలో అవకతవకలు జరి గాయని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విష యం తెలిసిందే.
PHD Admissions
పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు!

ప్రధానంగా వివిధ విభాగాల్లో పార్ట్‌టైం అభ్యర్థులకే ఎక్కువ సీట్లు ఇచ్చారని, రె గ్యులర్‌ అభ్యర్థులకు తక్కువ ఇచ్చారని విద్యార్థి జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేని విభాగంలో 25 శాతం పార్ట్‌టైం, 75 శాతం ఫుల్‌టైం అభ్యర్థు లకు అడ్మిషన్లు కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అధికారులు బేఖాతర్‌ చేసినట్లు ఆరోపిస్తున్నారు. న్యాయ విచారణ జరిపించాలని కూడా కేయూ దూరవిద్య కేంద్ర ఆవరణలో నిరా హార దీక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే.

చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌!

పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి..

ఇటీవల విద్యార్థి జేఏసీ నాయకులతో సీపీ రంగనా థ్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆరోపణలను లిఖితపూర్వకంగా రాసిస్తే వీసీ దృష్టికి తీసుకెళ్తానని సీపీ విద్యార్థి నాయకులకు సూచించారు. దీంతో పలు అంశాలను విద్యార్థి జేఏసీ నాయకులు కొన్ని పేజీల రిపో ర్టులు సమర్పించారని సమాచారం. అందులో కొ న్ని అంశాలను ఆరు రోజుల క్రితం కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ ఇట్టబోయిన తిరుపతి యాదవ్‌ వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..

చదవండి: Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలు పారదర్శకం

ఇష్టానుసారంగా..

పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్లలో వీసీ తన ఇష్టానుసారంగా కొందరికి అడ్మిషన్లు వచ్చేలా వ్యవహరించారని, యూజీసీ నిబంధనలు మార్చుకుని డీఆర్‌సీని కాదని, ఒక కొత్త అడ్మిషన్‌ కమిటీని ఇంటర్వ్యూ కోసం వివిధ విభాగాలను తయారు చేసి, తాను ఆమోదించిన ఆ కమిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించారని సీపీకి అందించిన లేఖలో పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధం..

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో ఇంటర్వ్యూల్లో ఆ విభాగపు సూపర్‌వైజర్‌ను ఇంటర్నల్‌ ఎక్స్‌పర్ట్‌ కింద ఉంచలేదు. వేరే విభాగపు సూపర్‌వైజర్‌ను కమిటీలో ఉంచడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా ఇద్దరూ వేరే యూనివర్సిటీ వాళ్లను ఎక్స్‌టర్నల్‌ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించారు. మెరిట్‌ విద్యార్థులకు సీట్లు రాకుండా నష్టం చేశారని, పలు విభాగాల అడ్మిషన్‌ కమిటీ ఆర్డర్‌లను బయట పెడితే నిజాలు బయటపడతాయని, ఈ కమిటీ ఆర్డర్లను యూనివర్సిటీ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేంటని లేఖలో ప్రశ్నించారు.

ఈడబ్ల్యూఎస్‌ కోటా ఎలా వచ్చింది?

అభ్యర్థులు అప్లికేషన్‌ నింపేటప్పుడు లేని ఈడబ్ల్యూఎస్‌ కోటా ఇంటర్వ్యూలో ఎలా రప్పించారని సీపీకి అందించిన లేఖలో విద్యార్థులు ప్రశ్నించారు. బయోటెక్నాలజీ విభాగంలో, బీసీ కేటగిరీ కింద ఓ మహిళా అభ్యర్థికి 51, మరో మహిళకు 46, మరొకరికి 44 మార్కులు వచ్చాయి. వీరిలో ఎవ్వరినీ ఎంపిక చేయకుండా 43 మార్కులు ఉన్న మరో మహిళా అభ్యర్థిని ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు.

ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో బీసీ–బీ కేటగిరీ కింద 65 మార్కులతో రెండో టాపర్‌ ఏ మహిళా అభ్యర్థిని కాదని, 52 మా ర్కులతో పురుష అభ్యర్థిని ఎంపిక చేశారని లేఖలో నిలదీశారు. ఇంకా పలు అంశాలను సీపీకి అందించిన లేఖలో పేర్కొన్నట్లు, ప్రవేశ పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ జాబితాను పేర్లతో సహా.. వెబ్‌ సైట్‌లో పొందుపర్చాలని కోరినట్లు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ ఇట్టబోయిన తిరుపతి యాదవ్‌ తెలిపారు.

Published date : 04 Oct 2023 04:15PM

Photo Stories