3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
మండలి కార్యాలయంలో లింక్డ్‌ఇన్ ద్వారా చేకూరే ప్రయోజనాలపై సెప్టెంబర్ 27న ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలి అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) ప్లాట్‌ఫారమ్ గురించి వివరిస్తూ.. ఇప్పటికే 9 లక్షల మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇక నుంచి ఎల్‌ఎంఎస్‌లో ఉద్యోగావకాశాలు కనిపిస్తాయని చెప్పారు. లింక్డ్‌ఇన్ ఇండియా హెడ్ సబాకరీం మాట్లాడుతూ.. ఏపీలో చాలా టాలెంట్ పూల్ ఉందని.. రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాలు పెంచడానికి, యజమానులను ఆకర్షించడానికి లింక్డ్‌ఇన్ సహాయపడుతుందని చెప్పారు. లింక్డ్‌ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ.. లింక్డ్‌ఇన్ లెర్నింగ్ సొల్యూషన్స్ నుండి విద్యార్థులు ప్రతివారం 60 కోర్సులు నేర్చుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
APSRTC: ఆర్టీసీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం
Medical Students: విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్