అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం
Sakshi Education
నారాయణపేట రూరల్: జిల్లాలో సాంకేతిక విద్యాభివృద్ధికి నాంది పలికినట్లు కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి తెలిపారు.
నారాయణపేటకు మంజూరైన ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను సెప్టెంబర్ 5న పట్టణంలోని యాద్గిర్ రోడ్‌లో ఉన్న ప్రతిభ కళాశాల బిల్డింగ్‌లో ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయరంగంలో సాంకేతికతను జిల్లాకు చేరువ చేయడానికి, ఈ ప్రాంత విద్యార్థుల కోసం కళాశాలను తీసుకొచ్చామని.. 40 సీట్లు మంజూరు చేయించామన్నారు. మొదటి సంవత్సరంలో 21 మంది బాలికలు, 16 మంది బాలురు ప్రవేశాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. పద్మజ, వైస్ ప్రిన్సిపాల్ పరిమళకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చదవండి:
Dr Hemanth Kumar: చదివిన కళాశాలకే డీన్‌గా!
IFoam Asia Organic Medal of Honour: డాక్టర్ దేబల్ దేవ్‌కు ఆర్గానిక్ పురస్కారం
Published date : 06 Sep 2023 04:51PM