Dr Hemanth Kumar: చదివిన కళాశాలకే డీన్‌గా!
ప్రస్తుత ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దిద్దుపూడికి చెందిన హేమంత్‌కుమార్ అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో 1993 బ్యాచ్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థిగా చేరి, 1994లో పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన ఆయన శాఖలో అనేక హోదాల్లో విధులు నిర్వర్తించారు.
చదవండి: IFoam Asia Organic Medal of Honour: డాక్టర్ దేబల్ దేవ్‌కు ఆర్గానిక్ పురస్కారం
గడిచిన ఏడేళ్లుగా ఖమ్మం జిల్లాలోని వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రొగ్రాం కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా ఇటీవల పదోన్నతి కల్పించి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల డీన్‌గా నియమించారు. దీంతో చదివిన కళాశాలలోనే డీన్‌గా అరుదైన అవకాశాన్ని అందుకున్నట్లయింది. ఇక్కడ చదివిన పలువురు ఇదే కళాశాలలో ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఉన్నతమైన స్థానం(డీన్) దక్కించుకున్న ఘనత మాత్రం హేమంత్ కుమార్‌కే దక్కింది.
చదవండి: IIT-Bombay students: ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బాధ్యతలు స్వీకరించిన హేమంత్‌కుమార్
అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ జె.హేమంత్‌కుమార్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీన్‌గా ఉన్న డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌కు సంగారెడ్డిలోని కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాలకు బదిలీ కాగా, ఆయన అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. అనంతరం వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ డీన్‌గా బదిలీపై వచ్చిన హేమంత్ బాధ్యతలు స్వీకరించారు.