Skip to main content

IFoam Asia Organic Medal of Honour: డాక్టర్‌ దేబల్‌ దేవ్‌కు ఆర్గానిక్‌ పుర‌స్కారం

ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకుడు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ దేబల్‌ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ “ఐఫోమ్‌ ఆసియా ఆర్గానిక్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’లభించింది.
IFoam Asia Organic Medal of Honour
IFoam Asia Organic Medal of Honour

వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్‌) ఆర్గానిక్స్‌ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్‌ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌ పురస్కారానికి డా. దేబల్‌ దేవ్‌ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు, ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగుచేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్‌ దేవ్‌ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. అవార్డులోతోపాటు 5 వేల డాలర్ల నగదుతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్‌ దేవ్‌ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. 

Devulapalli Ramanujarao Award 2023: దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Published date : 28 Aug 2023 03:31PM

Photo Stories