బీసీ గురుకులాల్లో ఐఐటీ ప్రత్యేక కోచింగ్
Sakshi Education
అధికారులకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ఆదేశం బీసీ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ప్రత్యేక శిక్షణతో కూడిన ఐఐటీ కోచింగ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల 11వ పాలకవర్గ సమావేశాన్ని సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో మార్చి 24న నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 72 గురుకుల పాఠశాలలను సీబీఎస్‌ఈకి అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గురుకులంలో మంచినీటి కోసం ప్రత్యేకంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు, ఎంజీపీఆర్ సెక్రటరీ కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ 13 జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
Published date : 25 Mar 2022 01:34PM