Lawcet Counselling: వర్సిటీలో చదివేదెలా?
అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా ఆప్షన్ల ఎంపికలో వర్సిటీ లా కళాశాల కనిపించకపోవడంతో అందరూ అయోమయం చెందుతున్నారు.
రూ.15 లక్షలు చెల్లించినా..
న్యాయవిద్యలో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ మేరకు లాసెట్ – 2023 కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మూడేళ్ల న్యా య విద్య ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల న్యాయ విద్య ఎల్‌ఎల్ బీ, రెండేళ్ల పీజీ కోర్సు ఎల్‌ఎల్‌ఎంలకు ప్రవేశాలు కల్పిస్తారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే న్యాయ కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు నిర్వహిస్తున్నా రు. ఈ కోర్సుల్లో 66 సీట్లు ఉన్నాయి. వర్సిటీ అఫి లియేషన్ కళాశాల ఎంపీఆర్ లా కాలేజీలో మూడేళ్ల లా 88, ఐదేళ్ల లా కోర్సులో 88 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. అయితే లాసెట్ కౌన్సెలింగ్‌లో బీఆర్‌ఏయూ న్యాయ కళాశాలకు ఆప్షన్లు కనిపించడం లేదు.
చదవండి: Law Courses: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు
జిల్లాలో ఒక్క ప్రైవేట్ కళాశాల ఎంపీఆర్ కాలేజీ మాత్రమే చూపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే సమస్యరాగా, రెండో విడత కౌన్సెలింగ్‌లో సమ స్య పరిష్కరించారు. అప్పట్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు సమస్యరాగా, రూ.15 లక్షలు చెల్లించారు. దీంతో బార్ కౌన్సిల్ లాఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చింది. మళ్లీ ఈ ఏడాదికి గుర్తింపు కొనసాగించలేదు. దీంతో కౌన్సెలింగ్ జాబితాలో లేదు.
అంతా అయోమయం..
లాసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబర్ 18 నుంచి 22 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేశా రు. 23 నుంచి ఆప్షన్లు ఎంపిక ప్రారంభమైంది. చివ రి రోజు శనివారం. సాయంత్రం వరకు ఆప్షన్ కనిపించలేదు. ప్రైవేట్ కళాశాల జాబితాలో ఉండి ప్రభుత్వ కళాశాల లేకపోవటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆప్షన్లు మార్పుకు ఆదివా రం వరకు అవకాశం ఉంది. జాబితాల్లో వర్సిటీ కళాశాల కనిపిస్తే విద్యార్థులు ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. లేదంటే ఇతర కళాశాలలే దిక్కు. రెగ్యులర్ పోస్టుల నియామకంకు సైతం ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. ప్రయివేట్ కళాశాలకు గుర్తింపు ఇస్తున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కళాశాలను నిర్లక్ష్యం చేయటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది.
సమస్య పరిష్కరిస్తాం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు కృషి చేస్తున్నాం. ఉన్నత విద్యా మండలి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి సమస్య తీసుకెళ్లాం. గత ఏడాది ఇలాంటి సమస్య వస్తే రూ.15 లక్షలు చెల్లించి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కమిటీకి ఆహ్వానించాం. వారు వర్చువల్‌గా పరిశీలించి గుర్తింపు ఇచ్చారు. ఈ ఏడాది సైతం ప్రత్యేకంగా సమస్యపై దృష్టిపెట్టాం.
– ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ