Skip to main content

High Court : విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ఈ కాలమ్‌ తప్పునిస‌రిగా ఉండాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
 telangana high court order today
Telangana High Court

ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది. ఈ వివరాల ప్రకారం.. తమ కుమారుడికి నో క్యాస్ట్‌.. నో రిలీజియన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో  స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్‌ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు.‘పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్‌ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. 

ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ఇదే చెబుతోంది. నో క్యాస్ట్‌.. నో రిలీజియన్‌ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్‌ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

Published date : 20 Jul 2023 12:09PM

Photo Stories