Skip to main content

SPL 4: ఘనంగా 'సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం

ఘట్‌కేసర్‌: 'సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సాక్షి ప్రీమియర్‌ లీగ్‌-4 (ఎస్‌పీఎల్‌) ఫిబ్ర‌వ‌రి 2న‌ ఘనంగా ప్రారంభమైంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారంలోని బాబురావు సాగర్‌ క్రికెట్‌ మైదానం క్రీడా సంబురానికి వేదికైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 65 జట్లు ఎస్‌పీఎల్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్య అథితిగా విచ్చేసిన (సాట్స్‌) చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ టాస్‌ వేసి లీగ్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథి ఆంజనే యగౌడ్‌, 'సాక్షి' మీడియా గ్రూప్‌ సీజీఎం కమల్‌ కిశోర్‌రెడ్డి సరదాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ వేసి క్రీడా కారులను ఉత్తేజ పరిచారు. వారితో పాటు ఏజీఎం ఉగ్రగిరిరావు పాల్గొన్నారు.
SPL 4
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సాట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌, 'సాక్షి' సీజీఎం కమల్‌కిశోర్‌రెడ్డి

క్రీడా నైపుణ్యం వెలికితీయడం అభినందనీయం...

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ మాట్లాడుతూ... పుట్టుకతోనే ఎవరూ విజేతలు కాలేరని, చిత్తశుద్ధితో చేసే ప్రయత్నంతోనే విజయం వారికి సొంతం అవుతుందన్నారు. సాధారణ, రాజకీయ వార్తలే
కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపు ణ్యాన్ని వెలికితీసేందుకు "సాక్షి యాజమాన్యం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

  • తొలి అండర్‌-18 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విజేత జట్టు కీడాకారిణి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిషను ఆదర్శంగా తీసుకొని ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
  • ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభ గల గ్రామీణ క్రీడాకారులను "సాక్షి మీడియా ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. క్రీడ లతో ఐక్యత భావం పెరుగుతుందని, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు.
  • సీజీఎం కమల్‌ కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ... గెలుపు ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు.
  • కార్యక్రమంలో "సాక్షి ఏజీఎం ఉగ్రగిరిరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

చదవండి: Savitri Devi: ఎన్నో నిందలు, అవ‌మానాలు ఎదుర్కొని కూతుర్ని విజేతగా నిలిపిన త‌ల్లి..

విజేతల వివరాలు

బాబురావు సాగర్‌ క్రికెట్‌ మైదానం-1

  • మొదటి మ్యాచ్‌లో ఐఐఎంసీ ఖైరతాబాద్‌ కళాశాల జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌ చేసిన సైదాబాద్‌ మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు 9.8 ఓవర్లలో 59 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
  • రెండవ మ్యాచ్‌లో మొఫ్కంజా కళాశాల జట్టు, ఇబ్రహీంపట్నం శ్రీదత్తా ఇంజినీరింగ్‌ కళాశాల జట్టుపై గెలుపొందింది. మొఫ్కంజా క్రీడాకారుడు అఫాన్‌ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మూడవ మ్యాచ్‌లో శ్రేయ ఇంజినీరింగ్‌ కళాశాల-బి జట్టు, వైష్ణవి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల జట్టుపై గెలుపొందింది.

చదవండి: U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..

బాబురావు సాగర్‌ క్రికెట్‌ మైదానం-2

  • మొదటి మ్యాచ్‌లో వేదా డిగ్రీ కళాశాల జట్టు, అంబేడ్కర్‌ డిగ్రీ కళాశాల జట్టుపై అలవోకగా విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో వెస్లీ డిగ్రీ కళాశాల-ఎ జట్టు, శ్రేయ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు-ఏ పై గెలుపొందింది. మూడవ మ్యాచ్‌లో విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు, ప్రగతి డిగ్రీ జట్టు పోటీపడగా 10 ఓవర్లలో ఇరు జట్లు 108 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. ఈ సందర్భంగా వేసిన సూపర్‌ ఓవర్‌ విజేతను వరించింది.
  • సూపర్‌ ఓవర్‌లో మొదటి బ్యాటింగ్‌ చేసిన ప్రగతి జట్టు 6 బంతుల్లో 26 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌ చేసిన విజ్ఞాన్‌ జట్టు 22 పరుగులు చేసి ఓటమి చవిచూసింది.
  • విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు క్రీడా కారుడు కలీం 56 పరుగులు చేయగా, ప్రగతి జట్టు క్రీడాకారుడు మోహన్‌ 46 వ్యక్తి గతంగా అత్యధికంగా పరుగులు చేశాడు.

చదవండి: ICC Test Cricketer of the Year 2022 : ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2022 ఇత‌నే..?

Published date : 02 Feb 2023 03:28PM

Photo Stories