Skip to main content

CIPET: ఉచిత నైపుణ్య శిక్షణ

విజయవాడ సమీపంలోని Central Institute Of Plastics Engineering & Technology (CIPET)లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ‘మెషీన్‌ ఆపరేటర్‌–ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌’ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ అక్టోబర్‌ 31న ఒక ప్రకటనలో తెలిపారు.
CIPET
ఉచిత నైపుణ్య శిక్షణ

ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఐసీ సహకారంతో 30 మందికి ‘మెషీన్‌ ఆపరేటర్‌–ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌’ కోర్సులో ఆరు నెలలపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, హోసూర్, చెన్నై ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. అవకాశం ఉన్నవారు సొంతగా సంస్థను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలిపారు.

చదవండి: CIPET: పది సప్లిమెంటరీ విద్యార్థులకూ ‘సీపెట్‌’లో ప్రవేశాలు

శిక్షణాకాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామని, 18 ఏళ్లు నిండిన పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 7893586494 నంబర్‌లో సంప్రదించి నవంబర్‌ నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. 

చదవండి: ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్

Published date : 01 Nov 2022 04:32PM

Photo Stories