Aqua University: రాష్ట్రంలో తొలి ఆక్వా వర్సిటీ
ఇది దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీ కానుందని చెప్పారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీరుస్తామన్నారు. నవంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ..
చదవండి: 40 ఎకరాల్లో.. పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ
నరసాపురం చరిత్రలో తొలిసారిగా..
పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఒకేరోజు సుమారు రూ.3,300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించాం. ఇన్ని శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలో బహుశా మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం, నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నా.
చదవండి: ఆక్వా రైతుల కోసం అందుబాటులోకి వచ్చిన నూతన యాప్?
ఫిషరీస్ యూనివర్సిటీ
ఇక్కడ ఆక్వా కల్చర్ ప్రధానమని మనందరికీ తెలుసు. మెరైన్ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్స్‌లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆక్వా కల్చర్‌కు సంబంధించిన స్కిల్, పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీతాలు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ అవసరమున్నా మన వారి నైపుణ్యాన్ని వినియోగించేలా గొప్ప చదువు అందించేందుకు ఇవాళ నాంది పలుకుతున్నాం. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పీజీ, డిగ్రీ హోల్డర్లతో ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు ఆక్వా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలలో మాత్రమే ఇవి ఉండగా మూడో వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. రూ.332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తై పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం.
చదవండి: భీమవరంలో ఆక్వా ల్యాబ్ ప్రారంభం