భీమవరంలో ఆక్వా ల్యాబ్ ప్రారంభం
Sakshi Education
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్‌ను కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ సెప్టెంబర్ 5న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని చెప్పారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలిసి చేపల రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై ఇరువురు చర్చించారు. సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్వా ల్యాబ్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్
ఎక్కడ : కొవ్వాడ అన్నవరం, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 06 Sep 2019 05:28PM