Skip to main content

ఆక్వా రైతుల కోసం అందుబాటులోకి వచ్చిన నూతన యాప్‌?

ఆక్వా రైతులకు నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ కోర్సుల యాప్‌ ద్వారా ఆక్వా రైతులకు నూతన మంచినీటి ఆక్వా కల్చర్‌ సాంకేతికత వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ‘మత్స్యసేతు’ వర్చువల్‌ లెర్నింగ్‌ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆర్థిక సాయంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చి –సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌ (ఐసీఏఆర్‌– సీఐఎఫ్‌ఏ)లు ఈ యాప్‌ను రూపొందించాయి. ఈ యాప్‌ను కేంద్ర మత్స్య శాఖ ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్‌లో చేపల పెంపకం, సంస్కృతి, సాంకేతికలపై రైతులకు స్వీయ–అభ్యాస మాడ్యుళ్లు ఉంటాయి. రైతుల సందేహాలకు నిపుణులు సలహాలిస్తారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అందుబాటులోకి మత్స్యసేతు మొబైల్‌ యాప్‌
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చి –సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌ (ఐసీఏఆర్‌– సీఐఎఫ్‌ఏ)
ఎందుకు : ఆన్‌లైన్‌ కోర్సుల యాప్‌ ద్వారా ఆక్వా రైతులకు నూతన మంచినీటి ఆక్వా కల్చర్‌ సాంకేతికత వ్యాప్తి చేయడమే లక్ష్యంగా...
Published date : 13 Jul 2021 05:09PM

Photo Stories