డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ తిరుపతి బ్రాంచ్‌లో ఉచితశిక్షణ కోసం దరఖాస్తుల గడువును ఏప్రిల్ 18వ తేదీ వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్థన్ తెలిపారు.
‘ఉచిత శిక్షణ’ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ మేరకు ఏప్రిల్ 8న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి బ్రాంచి స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్ పీవో పోస్టులకు, గ్రూప్–1 పోటీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల గడువు మొదట ఏప్రిల్ 10 వరకు నిర్ణయించామని పేర్కొన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు మరింత మేలు చేయాలనే ఉద్ధేశంతో ఏప్రిల్ 18 వరకు పొడిగించినట్లు తెలిపారు. రూ.6 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టభద్రులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.