KU: పీహెచ్‌డీ ప్రవేశాల గడువు పొడిగింపు
Sakshi Education
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, ఫార్మసీ, ఇంజనీరింగ్, లా విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఆయా విభాగాల డీన్‌లు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీతో గడువు ముగియనుండడంతో దానిని పొడిగించినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://www.kakatiya.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.
చదవండి:
CUET: ఆ ఐదు యూనివర్సిటీలు హాట్ ఫేవరెట్... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్
Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు..
Published date : 10 Apr 2023 05:31PM