Basara IIIT: ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు
జూన్ 19తో దరఖాస్తుల గడువు ముగిసిందన్నారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ సూచన మేరకు గడువును 22 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక కోటాలో జూన్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. జూలై 3న మెరిట్ విద్యార్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
చదవండి:
IIIT: ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
IIIT Basara మొత్తం సీట్లు, వివరాలు:
మొత్తం 1650 ఇంటిగ్రెటెడ్ బీటెక్(ఇంటర్+బీటెక్) సీట్లు భర్తీ కానున్నాయి. యూనివర్శిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద, మరో 150 అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.
అర్హత: ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్లు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్ కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే.. ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
Foundations of Modern Machine Learning: ట్రిపుల్ ఐటీలో టీచర్–సహాయక ఆన్‌లైన్ కోర్సు