VTG CET 2022: దరఖాస్తుల గడువు పెంపు
Sakshi Education
గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే వీటీజీ సెట్–2022 గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రాస్ ఏప్రిల్ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
మే 8వ తేదీన ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విద్యాశాఖ పరిధిలోని సొసైటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల సొసైటీల వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
చదవండి:
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 100 శాతం సీట్ల భర్తీకి సర్కార్ కసరత్తులు
Published date : 10 Apr 2022 04:21PM