గురుకుల సెట్‌పై సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి నవంబర్ 1న నిర్వహించే అర్హత పరీక్షపై సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహ ణ, హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రం తదితర అంశాలపై సందేహాలుంటే 1800 425 45678 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకునే వెసులుబాటును గురుకుల సొసైటీలు కల్పించాయి. విద్యార్థుల హాల్‌టికెట్లు https://tgcet. cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 వరకు వీటిని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Published date : 30 Oct 2020 01:37PM