Kakatiya University: ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలు పరీక్ష తేదీలు ఇవే..
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఎస్‌డీఎల్‌సీ (దూరవిద్య) ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికా రి నరేందర్ తెలిపారు.
డిసెంబర్ 6న పేపర్–1 కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, 8న పేపర్–2 ఎకోసిస్టమ్ ఎకలాజీ, 12న పేపర్–3 ఎన్విరాన్‌మెంటల్ స్టాటిస్టిక్స్ కంప్యూటేషన్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్స్, 14న పేపర్–4 ఎన్విరాన్‌మెంటల్ టాక్సిసీయాలజీ అండ్ మానిటరింగ్ పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.
ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
ఫైనల్ ఇయర్ పరీక్షలు..
కేయూ పరిధి దూరవిద్య ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ ఫైనల్ ఇయర్ పరీక్షలు డిసెంబర్ 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి నరేందర్ తెలిపారు. డిసెంబర్ 7, 11, 13, 15, 18 తేదీల్లో పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
Published date : 21 Nov 2023 10:52AM