Skip to main content

English: ఇంగ్లిష్‌ ఇక ఈజీ

గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రస్తుత పోటీప్రపంచంలో ఇంగ్లిష్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా.. ఇంతా కాదు.
English is now easy
ఇంగ్లిష్‌ ఇక ఈజీ

 ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌ నిర్వహణపై దృష్టి సారించింది. ఇప్పటికే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పుస్తకాలను ప్రభుత్వం అందజేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌ విద్యార్థులకు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెకండియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు అధ్యాపకులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టు బోధకులకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో నిర్వహించబోయే ఇంగ్లిష్‌ సబ్జెక్టు ప్రాక్టికల్‌ పరీక్షలపై లెక్చరర్లు ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.

చదవండి: Rameshwar Goud: తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది

సైన్స్‌ విభాగం, వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు మాత్రమే ఇప్పటి వరకు ప్రాక్టికల్‌ నిర్వహించే వారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని విభాగాల వారికి ఆంగ్ల సబ్జెక్టుపై ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్‌ అంశాలు ఇవే..

  • ఇంగ్లిష్‌ సబ్జెక్టు ప్రాక్టికల్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలపై ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, జస్ట్‌ ఏ మినిట్‌(ఒక నిమిషంలో మాట్లాడడం), రోల్‌ ప్లే( ఇద్దరు విద్యార్థుల సంభాషణ), లిజనింగ్‌ అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో అంశానికి నాలుగు మార్కుల చొప్పున 16 మార్కులు, రికార్డు నిర్వహణకు మరో నాలుగు మార్కులు కేటాయించనున్నారు. దీని వల్ల విద్యార్థులు ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. ఇంగ్లిష్‌లో మాట్లాడించడం, గ్రామర్‌ నేర్పడానికి ప్రత్యేక తరగతలు నిర్వహించనున్నారు.
     
Published date : 04 Sep 2023 03:47PM

Photo Stories