ఏలూరు మెడికల్ కాలేజీకి 150 సీట్లు
Sakshi Education
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు అయ్యాయి.
నేషనల్ మెడికల్ కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఏలూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్య ప్రారంభించాలని సూచించింది. ఏలూరులోని డీఎం హెచ్‌వో ప్రాంగణంలో ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగి తుదిదశకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో నేషనల్ మెడికల్ కమిషన్‌లోని మెడికల్ అసెస్‌మెంట్ బోర్డు ఏలూరు వైద్య కళాశాల పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
చదవండి:
NMC: ర్యాగింగ్ చేస్తే... కఠిన చర్యలు.. మార్గదర్శకాల్లోని ఇతర ముఖ్యాంశాలివీ..
Published date : 27 Apr 2023 03:43PM