Skip to main content

Elluri Shankar: వెక్కిరించిన వైకల్యాన్ని ‘కాళ్ల’రాశాడు

బెల్లంపల్లి: రెండు చేతుల్లేకపోయినా కాళ్లతో పరీక్ష రాసి ఆత్మవిశ్వాసానికి అసలు సిసలైన చిరునామాగా మారాడు ఎల్లూరి శంకర్‌.
Elluri Shankar
వెక్కిరించిన వైకల్యాన్ని ‘కాళ్ల’రాశాడు

నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి శంకర్‌ తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం(కంప్యూటర్స్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనంలోనే విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయినా పట్టుదలతో చదువు కొనసాగిస్తున్నాడు.

చదవండి: Inspirational Story: వైకల్యంతో పుట్టాడ‌ని తల్లిదండ్రులు వదిలేశారు... అనాథగా పెరిగి... ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు

ప్రస్తుతం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. భవిత డిగ్రీ కళాశాల కేంద్రంలో ఫిబ్రవరి 10న జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. బెంచిపై కూర్చుని ఎడమకాలితో జవాబు పత్రాన్ని.. కుడి కాలివేళ్లతో పెన్ను పట్టుకుని పరీక్ష రాశాడు. తోటి విద్యార్థులతోపాటే శంకర్‌ నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తి చేయడం విశేషం. 

చదవండి: పుట్టగానే ఆస్పత్రిలో ఆయన్ను చూసిన తండ్రి షాక్‌ తిని వాంతి చేసుకున్నాడు. నాలుగు నెలల వయసు వచ్చేవరకు నిక్‌ తల్లి సైతం ఆయన్ను దరిచేర్చుకోలేకపోయారు

Published date : 11 Feb 2023 01:43PM

Photo Stories