Skip to main content

Education: విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి

అరకులోయ టౌన్‌: విద్యాప్రమాణాలు మెరుగుపడేలా బోధన అందించాలని ప్రాంతీయ కళాశాల విద్య సంచాలకురాలు డాక్టర్‌ శోభరాణి ఆదేశించారు.
Education standards should be improved. Regional College Education Director calls for improved teaching in Arakuloya.

న‌వంబ‌ర్ 28న‌ ఆమె స్థానిక ప్రభుత్వ మహిళ, బాలుర కళాశాలను సందర్శించి సంబంధిత రికార్డులను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

చదవండి: విశ్వవిద్యాలయం అంటే అధ్యయన బోధన కేంద్రమని మరిచిపోతున్నామా?

కళాశాలలో అవసరమైన అతిథి అధ్యాపకుల నియామకంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బాలుర,మహిళ కళాశాల ప్రిన్సిపాళ్లు భరత్‌కుమార్‌నాయక్‌, రామకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ చలపతిరావు పాల్గొన్నారు.

Published date : 29 Nov 2023 03:43PM

Photo Stories