DOST 2021: సెప్టెంబర్ 23 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
Sakshi Education
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు.
Published date : 22 Sep 2021 06:08PM