పాత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి
చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద పనిచేసే స్థితిలో ఉన్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని పేద విద్యార్థుల కోసం విరాళంగా అందజేయాలని అక్టోబర్ 27న ఆమె ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల సేకరణ కోసం రాజ్‌భవన్ లో సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆసక్తి గలవారు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అమర్‌నాథ్‌ను (మొబైల్ నం.9490000242) సంప్రదించాలని సూచించారు. ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు, వ్యక్తులు తమ సంస్థ/వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్/మొబైల్ నంబర్‌లు, విరాళం ఇవ్వాలనుకుంటున్న ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల సంఖ్య సమాచారంతో rajbhavan-hyd@gov.inకు ఈ– మెయిల్ పంపవచ్చని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అవసరం ఉన్న పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో కూడిన సమాచారాన్ని rajbhavan-hyd@gov.inకు మెయిల్ ద్వారా అభ్యర్థన పంపాలని సూచించారు. చదువుతున్న తరగతి, కోర్సు, కాలేజీ పేరు, చిరునామా, కాలేజీ ఫోన్ లేదా మొబైల్ నంబర్, బోనఫైడ్ సర్టిఫికెట్‌ను మెయిల్ చేయాలని కోరారు.
చదవండి:
DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం