International Science Festival: ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో జిల్లా ఉపాధ్యాయుడు
Sakshi Education
కామారెడ్డి రూరల్: ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హర్యానాలో జనవరి 17 నుంచి 20 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు నిష్ణాతులై, విషయ పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులను పలుసార్లు పరీక్షించి ఆహ్వానం పంపింది.
చదవండి: ISRO: 2028లో నింగిలోకి భారత అంతరిక్ష కేంద్రం
ఇందులో కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విజయగిరి రామకృష్ణ ఎంపికై పాల్గొన్నారు. ప్రయోగాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని రామకృష్ణ జనవరి 21న తెలిపారు. ఈ విభాగంలో ప్రపంచంలోని 33 దేశాలకు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు. రామకృష్ణను పలువురు అభినందించారు.
Published date : 23 Jan 2024 09:19AM