Indian Book of Records: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారికి చోటు
Sakshi Education
సత్తెనపల్లి: అసాధారణ ప్రతిభతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బుడతడు (రెండు సంవత్సరాల రెండు నెలలు వయసు కలిగిన) దేసు వేదాన్ష్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
పట్టణానికి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి దేసు శేఖర్ మనుమడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అవినాష్, వైష్ణవిల కుమారుడు అయిన వేదాన్ష్ ఐబీఆర్ అచీవర్ కార్యక్రమంలో భాగంగా 20 జంతువులు, 12 పండ్లు, 15 శరీర అవయవాలు, 12 మంచి అలవాట్లు, 27 మంది స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, 30 నివాస గృహల వినియోగ వస్తువులు, ఆంగ్ల అక్షర మాలిక, 25 రకాల చర్యలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.ఆ బుడతడు ప్రతిభను మెచ్చుకొని పలువురు అభినందనలు తెలిపారు.
చదవండి:
Children's Talents : వీళ్లు పిల్లలు కాదు.. చిచ్చరపిడుగులు.. ఎందుకంటే..?
Dwarapureddy Chandramouli: విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు
Published date : 03 Feb 2024 12:24PM