Tati Nagendra: చిత్రకళలో రాణిస్తున్న నాగేంద్ర
Sakshi Education
మైదుకూరు: మైదుకూరు బాలుర జెడ్పీ హైస్కూల్‌కు చెందిన తాటి నాగేంద్ర చిత్రకారుడిగా రాణిస్తున్నాడు.

పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి ఎవరి వద్ద శిక్షణ పొందకుండానే స్వతహాగా చిత్రాలు గీస్తుండడం విశేషం. ఇటీవల కడపలో జరిగిన బాలోత్సవాల్లో ఈ విద్యార్థి తన చిత్రాలను ప్రదర్శించాడు. నాగేంద్ర తండ్రి సుబ్బరామయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
చదవండి: Guinness Record: గిన్నిస్ రికార్డు.. గుమ్మడికాయ పడవలో ప్రయాణం.. 26 గంటలు..
కొద్ది రోజుల కిందట అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కూడా నాగేంద్ర పాల్గొన్నాడు. భవిష్యత్తులో మంచి చిత్రకారుడిగా పేరు పొందాలనేది తన కోరికని నాగేంద్ర పేర్కొన్నాడు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 15 Nov 2024 01:46PM