Skip to main content

Degree: డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు పుస్తకం ఆవిష్కరణ

2021 విద్యా సంవత్సరం నుంచి బి.ఏ,బి.కాం, బి.ఎస్సీ,బి.బి.ఏ కోర్సులను చదివే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ద్వితీయ భాష తెలుగును అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి పాఠ్య ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘం అనేక సార్లు సమావేశమై విద్యార్థులలో రచనా నైపుణ్యాలను పెంచే పాఠ్య ప్రణాళికను రూపొందించింది. ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది.
Degree
డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు పుస్తకం ఆవిష్కరణ

'సాహితీ దుందుభి' అనే ఈ పుస్తకాన్ని సెప్టెంబ‌ర్ 21న‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, వైస్ చైర్మన్ ఆచార్య వెంకట రమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగు చదివే విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని చదివి రచనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆచార్య లింబాద్రి అన్నారు. సరళంగా మాట్లాడడం, సరళంగా రాయటం నేర్చుకున్నప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని లింబాద్రి అన్నారు.

సాహితీ దుందుభిని బోధించే అధ్యాపకులు ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని విద్యార్థులలో మానవీయ,  సామాజిక విలువలను పెంపొందింపజేయాలని ఆయన కోరారు. డిగ్రీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలలో ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 'సాహితీ దుందుభి' ప్రధాన సంపాదకులు ఆచార్య సూర్యాధనంజయ్, పాఠ్యాంశాల రచయితలు ఆచార్య కాశీం, డా.లావణ్య, డా.ఎస్.రఘు,డా.వెల్దండి శ్రీధర్, డా.శంకర్, డా.కృష్ణయ్య,  తెలుగు అకాడమీ తరఫున డా. భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

చదవండి:

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్!

ఛాయిస్ మీది..కోర్సు మాది..

Published date : 21 Sep 2021 06:11PM

Photo Stories