Covid Effect: తరగతుల నిర్వహణపై త్వరలో నిర్ణయం
Sakshi Education
కరోనా కేసుల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు జనవరి 13న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తరగతుల నిర్వహణపై తమను సంప్రదిస్తున్నారని ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. సంక్రాంతి అనంతరం సమావేశమై తరగతులు ఆన్ లైన్ లో నిర్వహించాలా, ఆఫ్‌లైనా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు విద్యార్థులను ట్రిపుల్ ఐటీలకు పంపించవద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.
చదవండి:
RGUKT: బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ఇచ్చిన గుర్తింపు ఇదే..
RGUKT Admissions: ఆర్‌జీయూకేటీ బాసరలో మాస్టర్స్ ప్రోగ్రామ్
Andhra Pradesh Jobs: ఏపీ ఆర్‌జీయూకేటీల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Published date : 14 Jan 2022 04:14PM