Navodaya Entrance Exam: నవోదయ ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు 25 వరకు గడువు
Sakshi Education

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 వరకూ గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ.శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 20న జరుగుతుందన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు లభిస్తే ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు హాస్టల్ వసతి లభిస్తుందన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు జవహర్ నవోదయ విద్యాలయాల గురించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించి ఎక్కువ మంది ప్రవేశ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని సూచించారు.
Published date : 18 Aug 2023 04:45PM