Skip to main content

Free Training: బ్యూటీషియన్‌ కోర్సుకు కౌన్సిలింగ్‌..

నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గాను ఫిబ్ర‌వ‌రి 21‌ ఉదయం 10గంటల నుంచి స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఫిబ్ర‌వ‌రి 20న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Beautician Course  Counseling session for unemployed young women at the institute

2 నెలల కాలపరిమితి కల్గిన ఈ కోర్సుకు పదో తరగతి పాసై ఉండి, 18 నుంచి 30ఏళ్ల వయస్సు కల్గి ఉండాలన్నారు. ఆసక్తి కల్గినవారు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో నేరుగా కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

చదవండి: పడి ఎగిసిన కెరటం ఈమె..ఎలా అంటే..?

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నెలకు రూ.3వేల ఫీజుతో హాస్టల్‌ వసతి కల్పించబడుతుందని అన్నారు. పూర్తి వివరాలకు 9133908000, 9133908111 నంబర్లను సంప్రదించాలని అన్నారు.

Published date : 21 Feb 2024 04:03PM

Photo Stories