Skip to main content

KNRUHS: ఆయుష్‌ యూజీ కన్వీనర్‌ సీట్లకు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌

ఆయుష్‌ యూజీ కన్వీనర్‌ కోటా సీట్లకు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 18న ఒక ప్రకటనలో తెలిపింది.
counseling for AYUSH UG convener seats
ఆయుష్‌ యూజీ కన్వీనర్‌ సీట్లకు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌

విశ్వవిద్యాలయం పరిధిలోని హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), నేచురోపతి–యోగా (బీఎన్ వైసీ), యునాని (బీయూఎంఎస్‌) డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18న సాయంత్రం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే అఖిల భారత కోటాలో ఆయుష్‌ కోర్సుల్లో చేరిన, కాళోజీ, ఎనీ్టఆర్‌ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులతో పాటు గత విడతలో సీటు పొంది చేరని అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in సందర్శించాలని సూచించింది.

Sakshi Education Mobile App
Published date : 19 Apr 2022 05:26PM

Photo Stories