Corona: ఉపాధ్యాయురాలికి కరోనా.. పాఠశాల మూసివేత
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణేంది.
సెప్టెంబర్ 1న విధులకు హాజరైన ఆమెకు సెప్టెంబర్ 2న నలతగా ఉండటంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలి పారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.
Published date : 03 Sep 2021 05:41PM