SKU: ఎస్కేయూలో అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగం కొనసాగింపు
Sakshi Education
అనంతపురం: శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయంలో అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగాన్ని 2023–24 విద్యా సంవత్సరం వరకూ కొనసాగిస్తున్నట్టు రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య తెలిపారు.
ఏపీ పీజీసెట్‌లో అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సుకి దరఖాస్తు చేసిన విద్యార్థులు రెండో దఫా కౌన్సిలింగ్‌లో ఆప్షన్ పెట్టుకుని ఈ విభాగంలో చేరవచ్చునని పేర్కొన్నారు. కాగా, పీజీ సెట్‌లో అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సుకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉన్నారు.
చదవండి: SK University: ఎస్కేయూతో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం
అయితే అనాలోచితంగా కోర్సును రద్దు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంపై ఉన్నత విద్యా మండలి ఆక్షేపణ తెలిపింది. అలాగే గత వారం రోజులుగా అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సు కొనసాగాలని వర్సిటీలో ఆందోళనలు, రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. దీంతో ఉన్నత విద్యామండలి ఆదేశాలమేరకు ఈ ఏడాది కోర్సు కొనసాగింపునకు వర్సిటీ యాజమాన్యం ఆమోదం తెలిపింది.
Published date : 19 Oct 2023 01:27PM