Skip to main content

Exams: తెలంగాణ లో పరీక్షలు ఉన్నట్లా? లేనట్లా? అయోమయంలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు!

Exams
Exams

 ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్‌ మాత్రం రాలేదు. కోవిడ్‌ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్‌ చేశారు. వాళ్లకు ఇప్పటికే ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళిక సగానికి పైగా పూర్తయింది. వచ్చే ఏడాది నీట్, జేఈఈ, ఎంసెట్‌కు విద్యార్థులు తర్ఫీదు అవుతున్నారు. పోటీ పరీక్షలతో పాటు, రెండో ఏడాది పాఠ్య పుస్తకాలు చదవడమే కష్టంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే మార్చిలో రెండో ఏడాది పరీక్షలూ నిర్వహించకపోతే విద్యార్థులకే ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం భావించింది. మొదటి ఏడాది పరీక్షలన్నా ఇప్పుడు నిర్వహిస్తే ఆ మార్కుల ఆధారంగా రెండో ఏడాదిలోనూ ప్రమోట్‌ చేయవచ్చని యోచించారు. ఈ తంతు జూలై, ఆగస్టులో పూర్తిచేసి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు మొదటి ఏడాది పరీక్షలు పెడితే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఒత్తిడిల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు పునరాలోచనలో పడింది.

Published date : 22 Sep 2021 06:16PM

Photo Stories