డిగ్రీ, పీజీ విద్యార్థులకు ‘కామర్స్ టాలెంట్ టెస్ట్’
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: నగరం వేదికగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్, అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆంబిషన్స్ కేరీర్ కౌన్సిలర్స్ సంయుక్త ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కామర్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 10న నిర్వహించే ఈ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 5 వేలు, ద్వితీయ బహుమతిగా 3 వేలు, తృతీయ బహుమతిగా 2 వేల నగదు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా పది మందికి ప్రోత్సాహాక బహుమతులు ఇస్తామన్నారు.
చదవండి:
Published date : 06 Apr 2023 12:59PM