US Consulate వీసా అప్లికేషన్ సెంటర్ చిరునామా మార్పు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వీసా దరఖాస్తుల కేంద్రం చిరునామాను జనవరి 8వ తేదీ నుంచి మారుస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తెలిపింది.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొత్త చిరునామా వివరాలను వెల్లడించింది. మాదాపూర్‌లోని హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ దిగువ కాంకోర్స్‌లో వీసా దరఖాస్తుల కేంద్రం కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది.
చదవండి: US కాన్సుల్ జనరల్‌గా జెన్నీఫర్ లార్సన్
8వ తేదీ నుంచి గల షెడ్యూల్ అపాయింట్‌మెంట్లు, డాక్యుమెంట్ల సమర్పణ, పాస్‌పోర్టు సేకరణ కోసం వచ్చే అభ్యర్థులు కొత్త చిరునామాకు రావాలని కాన్సులేట్ సూచించింది.
Published date : 06 Jan 2023 06:16PM