Skip to main content

CBSE: వీరికి ఫీజు లేదు..ఎందుకంటే..!

CBSE
CBSE

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 10, 12 తరగతుల విద్యార్థుల నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరంలో జరిగే పరీక్షల ఫీజులను, రిజిస్ట్రేషన్‌ రుసుము వసూలు చేయరాదని నిర్ణయించినట్లు మంగళవారం సీబీఎస్‌ఈ ప్రకటించింది. పది, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాలను  బోర్డుకు పంపించే సమయంలో కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారి జాబితాను సైతం అందించాలని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాను బట్టి విద్యార్థులకు ఫీజు మినహాయిస్తామని సీబీఎస్‌ ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ çభరద్వాజ్‌ చెప్పారు. 

Published date : 22 Sep 2021 06:24PM

Photo Stories