మన బడిని బాగు చేసుకుందాం.. పాఠశాలల పునఃప్రారంభ తేదీ ఇదే..
యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు
పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ‘ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించడం ద్వారా యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒకే కరిక్యులమ్, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. మే నెల ప్రారంభంలో పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు మూడు రోజులు కేటాయించాలి..’అని నిర్ణయించారు.
30 వేల పాఠశాలలకు బ్యాండ్‌విడ్త్
జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1న ప్రారంభించి 12 తేదీ వరకు పూర్తి చేయాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. త్వరలోనే టీ ఫైబర్ ద్వారా 30 వేల విద్యా సంస్థలకు బ్యాండ్‌విడ్త్ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు.