Skip to main content

వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీకి బీఓఎం ఏర్పాటు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ను ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Board Of Management Of Dr Ysr Horticultural University
వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీకి బీఓఎం ఏర్పాటు

బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, పాడేరు, చింతలపూడి, సింగనమల ఎమ్మెల్యేలు కే భాగ్యలక్ష్మి, వీ ఎలీజా, జే పద్మావతికి సభ్యత్వం కల్పించారు.

చదవండి: YSRHU: హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌లో మార్పులు.. ఇకపై అన్ని కొత్త పేరుతోనే

వర్సిటీ డీన్‌ డాక్టర్‌ ఏఎస్‌ పద్మావతితో పాటు శాస్త్రవేత్తల కేటగిరిలో రిటైర్డ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వైఎన్‌ రెడ్డి, అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉద్యాన వర్సిటీ అసోసియేట్‌ డీన్స్‌ డాక్టర్‌ ఎం.మాధవి, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ విజయపద్మ, డాక్టర్‌ పీ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఆదర్శ రైతుల కేటగిరీలో జున్నూరి వెంకటేశ్వరరావు (నంగవరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా), బత్తిన లక్ష్మీనారాయణ (మందస, శ్రీకాకుళం జిల్లా), దువ్వూరి చంద్రశేఖరరెడ్డి (దువ్వూరివారిపాలెం, నెల్లూరు జిల్లా),శివప్రసాద్‌రెడ్డి (సింహాద్రి పురం) ఆగ్రో–ఇండస్ట్రీస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కేటగిరీలో కేశవరెడ్డి (రాప్తాడు), జి.సుమిత్రరాజేష్, పంచాయతీరాజ్‌ విభాగం నుంచి స్టేట్‌ ఛాంబర్‌ ఆఫ్‌ పంచాయతీరాజ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌కు అవకాశం కల్పించారు. 

చదవండి: ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..

Published date : 01 Dec 2022 03:08PM

Photo Stories