Skip to main content

School Holidays are Cancelled: జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!

బీహార్‌ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది.
Bihar Education Department has canceled some holidays, Festivals in india, indian festivals

ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు. 

ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. కొత్త సెలవుల పట్టిక ప్రకారం 60 రోజుల సెలవుల్లో 38 రోజులు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులకు 22 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. మే ఒకటిన కార్మిక దినోత్సవం సెలవు కూడా రద్దు చేశారు.

చదవండి: Bihar Reservation Amendment Bill: బిహార్‌లో రిజర్వేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం

ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Published date : 28 Nov 2023 12:43PM

Photo Stories