KNRUHS: బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 6న నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్ మాప్ అప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది.
Published date : 07 May 2022 03:01PM