RGUKT: బాసర ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్.. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్
Sakshi Education
భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యాసంవత్సరానికి సీట్లు దక్కించుకున్న విద్యా ర్థులకు జూలై 7 నుంచి 3రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు.
ఈ మేరకు జూలై 6న ఆయన కౌన్సెలింగ్ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. అధికా రులు సూచించిన విధంగా సర్టిఫికెట్లు తీసుకు రావాలని, ఫీజు చెల్లించేందుకు కౌన్సెలింగ్ ఆవరణలోనే ఎస్ బీఐ కౌంటర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీల నకు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. చదవండి:
JOSSA: ‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..
RGUKT Admissions: ట్రిపుల్ ఐటీలకు 38,100 దరఖాస్తులు!
RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
Published date : 07 Jul 2023 03:42PM