Tholimettu: తొలిమెట్టుపై ఉపాధ్యాయులకు అవగాహన
Sakshi Education
జమ్మికుంట: పట్టణంలోని బాలుర ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు నవంబర్ 17న తొలిమెట్టుపై అవగాహన కల్పించారు.
జిల్లా పరిశీలకులు వినయధర్‌రాజు, సరిత, ఎంఈవో విడుపు శ్రీనివాస్‌లు హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎఫ్‌ఎల్‌ఎన్ తొలిమెట్టుపై తెలుసుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రణాళికలను సిద్ధం చేసుకొని రాబోయే రోజుల్లో పరిశీలకులు సందర్శనకు వచ్చినప్పుడు రికార్డులు చూపాలని అన్నారు.
చదవండి: Suvarna Vinayak: విద్యాభివృద్ధిలో తొలిమెట్టు, ఉన్నతి కీలకం
ప్రగతిని విశ్షేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్లు ఆకుల సదానందం, మిడిదొడ్డి మిడిదొడ్డి సమ్మయ్య, మండల నోడల్ అధికారి పద్మ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి, వేణుగోపాల్‌చారి, సంపత్, శ్యామ్‌కుమార్, సీఆర్పీలు రవి, సురేశ్, రాంబాబు, మహేందర్ పాల్గొన్నారు.
Published date : 20 Nov 2023 11:10AM