Vinila: నీతి ఆయోగ్ ఏబీ ఫెలోగా ఏయూ పరిశోధకురాలు
ఈ మేరకు ఆమెకు అక్టోబర్ 25న అధికారిక ఉత్తర్వులు అందాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరం మండలానికి యాస్పిరేషనల్ బ్లాక్స్ ఫెలో(ఏబీఎఫ్)గా వినీల సేవలందిస్తారు. ఈ సందర్భంగా ఆమెను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అక్టోబర్ 25న తన కార్యాలయంలో అభినందించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: Sakshi: గిరిజన విద్యార్థినికి బంగారు పతకం
ఏబీఎఫ్‌గా ఎంపికై న వారికి నెలకు రూ.55 వేలు స్టైపెండ్ అందిస్తారు. వారు తమకు కేటాయించిన మండలం సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తారు. స్థానిక ప్రజలకు వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నీతి ఆయోగ్ నుంచి అందిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 500 యాస్పిరేషనల్ బ్లాకులను ఎంపిక చేయగా.. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 15 బ్లాక్‌లు ఉన్నాయి.