Skip to main content

NMMS పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.. పరీక్ష విదానం ఇలా..

నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్నారు.
NMMS 2023 Test  arrangements for NMMS exam   National Means Merit Scholarship Examination

పకడ్బందీగా పరీక్ష నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలో 295 పాఠశాలల నుంచి 4,189 మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. హాల్‌ టికెట్లు అందని వారుంటే డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఐఎన్‌ స్కూలు లాగిన్‌లో ఏ స్కూలుకు సంబంధించి ఆ స్కూలు విద్యార్థులు హాల్‌ టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

పాస్‌వర్డ్‌ మరిచిపోయినా మరే ఇతర కారణాలు వల్ల అయినా హాల్‌ టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోని విద్యార్థులు, ఉపాధ్యాయులు డైరెక్ట్‌ లింకు ద్వారానూ తీసుకునే వెసులుబాటు విద్యాశాఖ కల్పించింది.

చదవండి: Scholarship: ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల.. ఎంపికైతే ఏటా రూ.50వేలు ఉపకార వేతనం

మూడు డివిజన్‌ కేంద్రాల్లోనే 22 పరీక్షా కేంద్రాలు...

జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో తొమ్మిది, గుడివాడలో ఏడు, ఉయ్యూరులో ఆరు కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ 22 కేంద్రాల్లో 4,189 మంది పరీక్ష రాయనున్నారు. డిసెంబరు 3వ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష ఇలా...

పేపరు –1 లో మెంటల్‌ (ఎంఏటీ) ఎబిలిటికి సంబంధించి 90 మార్కులకు 90 ప్రశ్నలను ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు. ఒక ప్రశ్నకు ఒక నిమిషం మాత్రమే సమయం. పేపరు–2లో (ఎస్‌ఏటీ)స్కోలస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. దీనికి కూడా 90 నిమిషాలు సమయం కేటాయించారు. 180 మార్కులలోనే 90 మార్కులకు సంబంధించి సబ్జెక్టులు వారీగా కేటాయింపులను పరిశీలిస్తే ఫిజిక్స్‌–12, కెమిస్ట్రీ–11, బయోలాజికల్‌ సైన్సు–12, గణితం–20, హిస్టరీ–10, జియోగ్రాఫి –10, పొలిటికల్‌ సైన్సు –10, ఎకనామిక్స్‌–5 మార్కులను కేటాయించారు.

170 మంది ఇన్విజిలేటర్లు...

పరీక్ష నిర్వహణకు 170 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే వీరికి ఆయా విధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించే చీఫ్‌ సూపరింటెండెంట్‌లు 22 మంది, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 22 మందిని నియమించారు. వీరు కాకుండా పోలీస్‌, మెడికల్‌ సిబ్బందిని ఆయా కేంద్రాలు వద్ద ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను విద్యాశాఖ కోరింది.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహించే కేంద్రాలు వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాల్సిందిగా పోలీస్‌ ఉన్నతాధికారులను కోరా ము. వారు ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. అలాగే మెడికల్‌ వారికి కూడా చెప్పాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను ఆయా సెంటర్లు వద్ద ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులతో పాటు అత్యవసర
మందులతో సిద్ధంగా ఉంటారు. విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా, విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చాం.
– తాహెరాసుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి మచిలీపట్నం

Published date : 01 Dec 2023 02:56PM

Photo Stories