Foreign Education: బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు దరఖాస్తులు
Sakshi Education
వివేకానంద విదేశీ విద్య పథకం కింద 2022–23 సంవత్సరానికి అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నామని Telangana Brahmin Samkshema Parishad పాలనాధికారి యు.రఘురాం శర్మ తెలిపారు.
అర్హులు అక్టోబర్ 15 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.brahminaparishad.telangana.gov.in ను చూడాలని అక్టోబర్ 13న ఒక ప్రకటనలో సూచించారు.
ఈ అవకాశాన్ని అర్హులైన తెలంగాణ బ్రాహ్మణ విద్యార్థులందరూ వినియోగించుకోవాలని పరిషత్తు చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి విజ్ఞప్తి చేశారు.
చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..
Published date : 14 Oct 2022 01:50PM